బిగ్ న్యూస్ : ఏపీలో మరో ఘోరమైన అగ్ని ప్రమాదం.!

Sunday, August 9th, 2020, 08:56:41 AM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని చెప్పాలి. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే ఒక్క విశాఖలోనే నాలుగు విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. పైగా నిన్ననే పట్టపగలే విశాఖ గంగమ్మపై ఓ బోటు తగలబడిపోయింది. ఇలా ఎన్నో విదారకర ఘటనలు విశాఖను కుదిపేయగా ఇప్పుడు మరో ఘోరమైన ప్రమాదకర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లోని మేక్ షిఫ్ట్ అనే ప్రయివేట్(కోవిడ్) ఆసుపత్రిలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకునే సరికి రాత్రికి రాత్రి ఆ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఏడుగురు అగ్నికి ఆహుతయ్యిపోయారు. అలాగే ఇదే హాస్పిటల్ లో మొత్తం 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఏపీలో మరో దారుణ విషాదకర ఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ ఘటనకు ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. అలాగే ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.