బిగ్ బ్రేకింగ్ న్యూస్ : చైనాలో మరో సరికొత్త వైరస్ కలకలం.!?

Tuesday, March 24th, 2020, 04:57:20 PM IST


మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడున్న కరోనా వైరస్ నే ఎలా కట్టడి చెయ్యాలో అర్ధం కాక ప్రపంచ దేశాల శాస్తవేత్తలు అంతా తలలు బాదుకుంటుంటే అది చాలదు అన్నట్టు మరోసరికొత్త వైరస్ దాపరించినట్టుగా తెలుస్తుంది.

దీనికి కరోనా వైరస్ లానే ఓ పేరు కూడా పెట్టేసారు. దీనికి “హంటా వైరస్” అనే పేరు పెట్టేసారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. చైనాలోని ఒక బస్సు లో ఉన్న కొంత మంది ప్రయాణికులను పరిశీలించగా అందులో ఒకరికి ఈ వైరస్ తాలూకా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని మిగతా వారికి సంబంధించిన రిపోర్టులు కూడా రావాల్సి ఉంది.

అయితే కరోనా వైరస్ లానే ఇది కూడా కొన్ని ప్రాణులను తిఎయ్యడం వలనే సంక్రమిస్తుంది అని కూడా సమాచారం. ఇది ఎలుకల మూత్రం నుంచి సంక్రమిస్తుంది అని తెలుస్తుంది.ప్రస్తుతానికి అయితే దీని కోసం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ పలు వార్తా ప్రచార మాధ్యమాలు మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.