విషాదం: చెస్ట్ ఆసుపత్రి నుంచి మరో కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో..!

Tuesday, June 30th, 2020, 02:53:40 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో జర్నలిస్ట్ మనోజ్ మృతి, నిన్న చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడి మరణం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.

అయితే తాజాగా చెస్ట్ ఆసుపత్రి నుంచి మరో వీడియో బయటకొచ్చింది. ఆసుపత్రిలో రోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రాణాలు పోతున్నా కనీసం చికిత్స అందించడం లేదని ఆరోపిస్తూ సయ్యద్ (38) అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. అసలు తన వార్డులో వైద్య సిబ్బంది ఎవరూ లేరని వీడియో తీసి అనంతరం మరణించాడు. అయితే సయ్యద్‌ ఉదయం మరణించినప్పటికీ, ఇప్పటివరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సయ్యద్ మృతదేహాన్ని అప్పగించాలని కూడ డిమాండ్ చేస్తున్నారు.

చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి మరొకరు మృతి

చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి మరొకరు మృతి=================================================ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు. తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసి సయ్యద్‌ అనే వ్యక్తి చనిపోయాడు.

Posted by News18 Telugu on Monday, June 29, 2020