కాంగ్రెస్‌ను వీడేందుకు రెడీ అయిన మాజీ మంత్రి కుమారుడు..!

Saturday, November 21st, 2020, 02:31:22 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌కు గ్రేటర్ ఎన్నికలకు ముందు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ వంటి వారు పార్టీనీ వీడి బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. అయితే తాజాగా దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే గోషామహాల్ డివిజన్ కాంగ్రెస్ టికెట్‌పై కాంగ్రెస్ నాయకత్వంతో విక్రమ్ గౌడ్‌కు విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ డివిజన్ టిక్కెట్ తన వర్గీయులకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసే యోచనలో విక్రమ్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్‌తో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే టికెట్ల లొల్లి సర్దుకుని విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌లో ఉంటారా లేక బీజేపీలో చేరుతారా అనేది తెలియాల్సి వచ్చింది.