నూతన్ నాయుడిపై మరో కేసు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం..!

Saturday, September 12th, 2020, 08:30:10 AM IST

సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు్‌పై మరో కేసు నమోదయ్యింది. ఇప్పటికే దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సీఎంవో ఆఫీసులో పనిచేసే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు వాడుకుని మోసానికి పాల్పడినట్టు కూడా తేలడంతో దానిపై కూడా కేసు నమోదయ్యింది.

అయితే తాజాగా ఉద్యోగాల పేరిట నూతన్ నాయుడు ఇద్దరిని నమ్మించి మోసం చేసిన ఉదంతం బయటకు రావడంతో మరో కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డిలకు ఎస్‌బీఐలో ఉద్యోగాల ఇప్పిస్తానని నూతన్ నాయుడు చెప్పడంతో ఇందుకోసం శ్రీకాంత్ రెడ్డి 12 కోట్లు, నూకరాజు 5 లక్షలు ఇచ్చినట్టు పోలీసులకు తెలిపారు. రెండేళ్లు గడిచిన నూతన్‌నాయుడు ఉద్యోగాలు ఇప్పించకపోడంతో తాము మోసపోయినట్టు తెలుసుకున్నామని బాధితులు అన్నారు.