బిగ్ న్యూస్: మరొక కేంద్ర మంత్రి కి సోకిన కరోనా

Thursday, October 8th, 2020, 01:00:22 AM IST


కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో విలయ తాండవం చేస్తోంది. వేల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి అనారోగ్యం పాలు అవుతున్నారు ప్రజలు. వందల సంఖ్యలో బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ఈ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. తాజా గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు కరోనా వైరస్ భారిన పడ్డారు. బీజేపీ కి చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

బుధవారం నాడు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ భారిన పడ్డా ను అని, తాజాగా చేయించుకున్న కరోనా నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది అని, ప్రస్తుతం ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు అని, వైద్యుల సూచనలు మేరకు ఇంట్లోనే ఉంటున్నాను అని తెలిపారు.