టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై గత కొద్ది రోజులుగా వరుస కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఆయనపై మరో కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట బృందావనం అపార్ట్మెంట్లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఐసీపీ సెక్షన్ 188, 171ఈ కింద కేసు నమోదు చేశారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని జేసీ వర్గీయులు తప్పుపడుతున్నారు. కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే తమ నేతపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో తమ వారిని నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించన సంగతి తెలిసిందే.