కరోనా తో బీజేపీ ఎమ్మెల్యే మృతి

Monday, November 30th, 2020, 08:00:09 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే రాజస్థాన్ లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా వైరస్ మహమ్మారి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయం లో ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడ్డారు. మొదటి నుండి ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలను కోల్పోయారు.

అయితే బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాష్ట్ర అభివృద్ది లో ఆమె కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు. అయితే ఎమ్మెల్యే మృతి తో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన మహేశ్వరి, 2004 ఎన్నికల్లో లోక్ సభ కి కూడా ఎన్నికయ్యారు. కిరణ్ మహేశ్వరి మృతి తో బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.