బిగ్‌న్యూస్: వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక ట్విస్ట్..!

Thursday, September 24th, 2020, 01:57:29 PM IST

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సీబీఐ మరింత దూకుడు పెంచింది. అయితే ఇందులోనే భాగంగా పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. అయితే మున్నా బ్యాంక్‌ లాకర్‌లో 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇదేకాకుండా మరికొన్ని బ్యాంకులలో 20 లక్షల ఎఫ్‌డీలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.

అయితే మున్నా ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందనే దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో మున్నా ఫ్యామిలీ వివాదంలో వైఎస్ వివేకా కలగజేసుకున్నట్లు సమాచారం. మున్నా ముగ్గురిని వివాహం చేసుకోగా భార్య భర్తల పంచాయితీ వివేకా వద్దకు రావడంతో అప్పట్లో మున్నాను వివేకా మందలిచినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను విచారించి అనంతరం అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు అతడి తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచి అందులో ఉన్న నగదు, ఇతర అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.