జగన్ సర్కార్‌కు మరో షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

Thursday, October 29th, 2020, 09:09:48 PM IST


ఏపీ సర్కార్‌కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈ ప్రాజెక్టు కోసం పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. డీపీఆర్‌కు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటికి తెలపడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కాదు ఏపీ, తెలంగాణలో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కేంద్రం ఇరు రాష్ట్రాలకు సూచించింది.