ఏపీ లో మరో మంత్రికి కరోనా పాజిటివ్

Tuesday, September 1st, 2020, 04:16:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజుల నుండి నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన కి గురి అవుతున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో లో తాజాగా మరొక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం తో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించు కోగా, కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అయితే కరోనా సోకిన విషయం తెలియడం తో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు లో ఇటీవల పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేని కి కరోనా సొకగా, అయిన చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. వైసీపీ నేతలు చాలా మంది కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు. కాగా రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్ష వరకు యాక్టిివ్ గా ఉన్నాయి. రోజురోజుకీ పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.