ఏపీ లో మారని కరోనా పరిస్థితి…మరో 77 మంది మృతి!

Friday, September 11th, 2020, 06:11:05 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 71,137 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 9,999 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,44,791 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనా వైరస్ కారణం గా ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారిన పడి, చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 4,779 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 11,069 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43,821 కి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 96,191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.