తెలంగాణలో మరో 997 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, November 13th, 2020, 09:30:25 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 42,163 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,55,663 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,397 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,222 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,37,172 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 17,094 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.