తెలంగాణలో మరో 993 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, November 25th, 2020, 09:51:30 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 47,593 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 993 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,66,042 కి చేరింది. అయితే ఇంకా కరోనా వైరస్ మహమ్మారి కి పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,441 కి చేరింది. అంతేకాక నిన్న ఒక్కరోజే 1,150 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకున్న వారితో కలిప మొత్తం తెలంగాణ రాష్ట్రం లో 2,53,715 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 10,886 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.