ఏపీ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…మరణాలు

Tuesday, August 25th, 2020, 08:52:08 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మళ్లీ భారీ స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో 64,351 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 9,927 కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,68,744 కి చేరింది. అయితే అదే తరహాలో గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ భారిన పడి 92 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,460 కి చేరింది.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,419 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కోలుకున్న వారి తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 2,75,352 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 89,932 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.