తెలంగాణలో మరో 978 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, October 25th, 2020, 10:45:22 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 978 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 2,31,252 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,307 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 1,446 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,10,480 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 19,465 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.