బిగ్ న్యూస్: ఏపీ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…మరణాలు!

Tuesday, August 4th, 2020, 09:54:28 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే గడిచిన 24 గంటల్లో 64,147 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా అందులో 9,747 పాజిటివ్ కేసులు గా తేలాయి. అయితే ఒక్క రోజులో మళ్లీ ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.అయితే తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసుల తో కలిపి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,76,333 కి చేరింది.

కరోనా వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నేడు ఒక్క రోజే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 67 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1604 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 79,104 మంది కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 95,625 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.