భారత్ లో మరో 18,599 కేసులు…97 మరణాలు

Monday, March 8th, 2021, 11:34:46 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 మరో 5,37,764 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,599 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 12 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం కాస్త ఆందోళన కి గురి చేస్తోంది. మళ్ళీ 18 వేలకు పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 97 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,57,853 కి చేరింది. నిన్న ఒక్క రోజే 14,278 కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,08,82,798 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,88,747 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.