బిగ్ న్యూస్: ఏపీ లో భారీగా నమోదు అయిన కరోనా మృతుల సంఖ్య!

Sunday, August 9th, 2020, 07:49:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా అందులో 10,820 కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,27,860 కి చేరింది. అయితే నేడు ఒక్క రోజే భారీగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

కరోనా వైరస్ భారిన పడి ఒక్క రోజే 97 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రం లో రోజురోజుకీ ఈ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2,036 కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 9,097 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,35,817 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రం లో 87,112 మంది కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నారు.