కరోనా అప్డేట్: ఏపీ లో మళ్లీ భారీగా నమోదు అయిన కేసులు…మరణాలు!

Saturday, August 22nd, 2020, 09:00:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10,276 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,45,216 కి చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 97 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 3,189 కి చేరింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,593 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,49,743 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 89,389 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.