బిగ్ న్యూస్: కరోనా వైరస్ భారిన పడి ఏపీ లో మరో 97 మంది మృతి!

Friday, August 14th, 2020, 07:25:42 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మాహమ్మరి మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా నమోదు అయిన కరోనా కేసులతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర భయాందోళన కి గురి అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 8,943 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,73,085 కి చేరింది. అదే విధంగా రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.

గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి 97 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,475 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రం లో 89,907 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. గడిచిన ఒక్క రోజులోనే 9,779 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,80,703 కి చేరింది. రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.