ఏపీ లో తగ్గని కరోనా ఉధృతి…మళ్లీ భారీగా కేసులు!

Friday, August 21st, 2020, 05:22:22 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజుకి నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 9,544 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,32,045 కి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకీ మరింతగా పెరుగుతాయి.

అదే విధంగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 91. తాజాగా కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 3,092 కి చేరింది. కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,827 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 2,41,150 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రం లో 87,803 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.