తెలంగాణలో మరో 952 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Tuesday, November 17th, 2020, 09:41:46 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 38,245 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 952 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కేసులతో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828 కి చేరింది. అయితే ఇంకా కరోనా వైరస్ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజా గా నమోదు అయిన ఈ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,410 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,602 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,43,686 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 13,727 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా వైరస్ ను అరికట్టడం లో తెలంగాణ రాష్ట్రం ముందంజ లో ఉందని చెప్పాలి.