తెలంగాణలో మరో 948 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, November 18th, 2020, 09:20:54 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగానే ఉన్నా, పాజిటివ్ కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 42,433 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 948 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,59,776 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,415 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 1,607 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,45,293 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 13,068 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.