బిగ్ న్యూస్: మళ్లీ భారత్ లో భారీగా కరోనా కేసులు…మరణాలు

Sunday, August 30th, 2020, 12:54:19 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకి గురి చేస్తున్న కరోనా భారత్ లో భారీ కేసులతో దేశ ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది. అయితే భారత్ లో గడిచిన 24 గంటల్లో 78,761 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి భారత్ లో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 35,42,734 కి చేరింది. అయితే భారత్ లో ఈ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు, వైద్యులు చెబుతున్నా, కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో పాటుగా మరణాల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 948 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు భారత్ లో 63,498 కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా, కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ రికవరీ భారత్ లో మెరుగ్గానే ఉంది అని చెప్పాలి. 27,13,934 మంది ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో ప్రస్తుతం 7,65,302 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.