కరోనా అప్డేట్: భారత్ లో ఒక్క రోజే 70 వేలకు చేరువలో కేసులు!

Saturday, August 22nd, 2020, 10:52:50 AM IST

india_corona

భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీగా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 70 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్ లో మరో 69,878 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 29,75,701 కి చేరింది. 30 లక్షలకు చేరువలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండటం దేశ ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది.

ఒక పక్క అదే తరహాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 945 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 55,794 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. భారత్ లో కరోనా వైరస్ భారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,631 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,22,577 కి చేరింది.

ప్రస్తుతం భారత్ లో 6,97,330 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.