భారత్ లో మరో 94,052 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, June 10th, 2021, 10:39:38 AM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొద్ది రోజులుగా తగ్గు ముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో మరో 20,04,690 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 94,052 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,91,83,121 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 6,148 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే బీహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడం తో ఈ సంఖ్య లో పెరుగుదల ఉండటం జరిగింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 3,59,676 కి చేరింది. అయితే ఈ మహమ్మారి భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,51,367 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే పాజిటివ్ కేసుల కంటే రికవరీ ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2 కోట్ల 76 లక్షలకు పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 11 లక్షల మంది కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.