బిగ్ న్యూస్: భారత్ లో ఆగని కరోనా మరణ మృదంగం…మరో 940 మంది మృతి

Sunday, October 4th, 2020, 11:11:43 AM IST

ప్రపంచ దేశాలను భయ పెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 75,829 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 65,49,373 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ మరణాల సంఖ్య సైతం భారత్ లో పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 940 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,01,782 కి చేరింది. ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు లో భారత్ కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి.

గడిచిన 24 గంటల్లో 82,260 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 55,09,966 కి చేరింది. భారత్ లో 9,37,625 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.