భారత్ లో మరో 8,635 కేసులు…94 మరణాలు

Tuesday, February 2nd, 2021, 12:08:22 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 6,59,422 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 8,635 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,07,66,245 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 94 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మృతుల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,54,486 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 13,423 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 1,04,48,406 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,63,353 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో వేగవంతం గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.