కరోనా అప్డేట్: ఏపీలో మళ్లీ పెరిగిన కేసులు…మరో 93 మంది మృతి

Wednesday, August 12th, 2020, 08:37:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుండి నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల విషయం లో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన లకు గురి అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 9,597 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకూ రాష్ట్రం లో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146 కి చేరింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 93 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

అయితే తాజాగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 2,296 కి చేరింది. అంతేకాక కరోనా వైరస్ భారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 6,676 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,61,425 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 90,425 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యా క్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.