తెలంగాణ లో మరో 922 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, November 2nd, 2020, 10:16:08 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 25,643 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 922 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,40,970 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,348 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం ముందంజ లో ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 1,456 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,21,992 కి చేరింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 17,630 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.