బిగ్ న్యూస్: ఏపీ లో మరో 9,024 కరోనా కేసులు…87 మరణాలు

Tuesday, August 11th, 2020, 07:03:06 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 9,024 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 58,315 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 9,024 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,44,549 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 87,597 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. గడిచిన 24 గంటల్లో 9,113 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,54,749 కి చేరింది. అంతేకాక కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,203 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కరోనా వైరస్ కి సంబంధించి వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.