భారత్ లో మరో 11,649 కేసులు…90 మరణాలు

Monday, February 15th, 2021, 11:21:12 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 4,86,122 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 11,649 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,09,16,589 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 90 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే వంద లోపు మరణాల సంఖ్య నమోదు కావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెల్లమెల్లగా కరోనా వైరస్ ప్రభావం దేశంలో తగ్గుముఖం పడుతుంది అని అంటున్నారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,55,732 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకూ కోటి ఆరు లక్షలకు పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,39,637 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.