బిగ్ న్యూస్: దేశంలో ఏ మాత్రం తగ్గని కరోనా ఉధృతి…మరో 895 మంది మృతి!

Friday, October 16th, 2020, 10:28:52 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 10,28,622 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 63,371 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 73,70,469 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 895 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,12,161 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 70,338 మంది కరోనా వైరస్ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు 64,53,779 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 8,04,528 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.