బిగ్ న్యూస్: ఏపీ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Tuesday, August 18th, 2020, 11:11:18 PM IST


కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,090 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 9,652 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,06,261 కి చేరింది.

అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి గడిచిన 24 గంటల్లో 88 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,820 కి చేరింది. అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,211 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,18,311 కి చేరింది.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 85,130 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా, తాజాగా కరోనా రికవరీ రేటు ఏపీ లో మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.