ఏపీ లో తాజా కరోనా లెక్కలు ఇవే!

Sunday, August 16th, 2020, 01:52:37 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయడం తో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా మరో 8,732 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన ఈ కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,78,922 కి చేరింది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 87 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,562 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజురోజుకీ కరోనా వైరస్ రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,414 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,88,222 కి చేరింది.

అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 88,138 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే తాజాగా నమోదు అయిన కేసులతో రాష్ట్రం లో ని ప్రజలు తీవ్ర భయాందోళన కి గురి అవుతున్నారు. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.