భారత్ లో మరో 9,309 కేసులు…87 మరణాలు

Friday, February 12th, 2021, 11:02:12 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,65,944 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 9,309 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే పది వేల లోపు కేసులు నమోదు కావడం తో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,08,80,603 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 87 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,55,447 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 97.32 శాతానికి పెరిగి ప్రపంచంలో కెల్లా కరోనా వైరస్ ను కట్టడి చేసిన దేశాల్ల భారత్ ముందు వరుస లో ఉంది. ప్రస్తుతం భారత్ లో 1,35,926 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.