కరోనా భారిన పడి ఒక్క రోజే 861 మంది మృతి!

Sunday, August 9th, 2020, 03:10:59 PM IST

Corona_india

కరోనా వైరస్ మహమ్మారి దేశం లో రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు ప్రజలను మరింత భయాందోళన కి గురి చేస్తున్నాయి. అయితే నిన్న ఒక్క రోజే 64,399 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.తాజాగా నమోదు అయిన ఈ కేసుల తో మొత్తం భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 21,53,011 కి చేరింది. భారీగా పెరుగుతున్న కేసులతో పాటుగా కరోనా వైరస్ భారిన పడి గడిచిన 24 గంటల్లో 861 మంది మృతి చెందారు. అయితే రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

భారత్ లో కరోనా రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పాలి. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 68.3 శాతం గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14,80,885 కి చేరింది. కరోనా అయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు భారత్ లో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 43,379 కి చేరింది. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారత్ లో 6,28,747 కరోనా వైరస్ కేసులు యాక్టి వ్ గా ఉన్నాయి.