బిగ్ న్యూస్: ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Monday, August 24th, 2020, 07:02:07 PM IST

AP_corona_list

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం లో నమోదు అవుతున్న కరోనా కేసుల విషయం లో ప్రజలు మరింత ఎక్కువగా భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా, అందులో 8,601 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,58,817 కి చేరింది.

అయితే గడిచిన 24 గంటల్లో మరో 86 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు కరోనా సోకి రాష్ట్రం లో మృతి చెందిన వారి సంఖ్య 3,368 కి చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతున్నా, కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కరోనా రికవరీ మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,741 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రం లో 2,68,828 కి చేరింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం 89,516 పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.