అక్కడ మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Thursday, November 12th, 2020, 08:37:41 AM IST

Corona_2506

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దీని ప్రభావం గట్టిగానే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గినట్లే అనిపించినా, మళ్ళీ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. బుదవారం నాడు కొత్తగా 8,593 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఢిల్లీ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,59,975 కి చేరింది. అయితే దేశ రాజధాని లో చలికి తోడుగా కాలుష్యం కూడా ఎక్కువగా ఉండటం కారణం చేత పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని పలువురు అంటున్నారు.

అయితే బుదవారం ఒక్కరోజే 85 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ లో 42,629 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి. అయితే భారత్ లో ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.