కరోనా అప్డేట్: ఏపీ లో మరో 8,555 కేసులు…67 మరణాలు!

Sunday, August 2nd, 2020, 07:47:10 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో 52,834 శాంపిల్స్ ను పరీక్షించగా 8,555 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయినా ఈ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 1,58,764 కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 6,272 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,886 కి చేరింది.

అయితే నేడు ఒక్క రోజే 67 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఉదయం 9 గంటల నుండి నేడు ఉదయం 9 గంటల వరకు 67 మంది ప్రాణాలను కోల్పోగా, మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,474 కి చేరింది. అయితే ఇపుడు రాష్ట్రం లో 74,404 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.