ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Monday, September 7th, 2020, 08:36:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే గత కొద్ది రోజులతో పోల్చితే నేడు నమోదు అయిన లెక్కలతో పరిస్ఠితి కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,368 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,03,598 కి చేరింది. మొత్తంగా అయిదు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అయితే గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 70 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,487 కి చేరింది. తాజాగా మరో 10,055 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,01,179 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 97,932 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.