ఏపీ లో తగ్గని కరోనా ప్రభావం…3 లక్షలకు చేరువలో కరోనా కేసులు!

Monday, August 17th, 2020, 08:29:53 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రం లో మూడు లక్షలకు చేరువలో ఉండటం తో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 6,780 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,96,609 కి చేరింది.

అయితే కరోనా వైరస్ మరణాల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటం చేత గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 82 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 2,732 కి చేరింది. అయితే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో 2,09,100 మంది కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 84,777 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.