బిగ్ న్యూస్: ఏపీ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే.

Thursday, September 24th, 2020, 07:10:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 76,000 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 7,885 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,51,490 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 52 మంది కరోనా వైరస్ కి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,558 కి చేరింది. అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,807 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 5,76,579 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 69,353 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.