కరోనా అప్డేట్: ఏపీ లో మరో 7,665 కేసులు…80 మరణాలు!

Monday, August 10th, 2020, 07:50:58 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి స్వైర విహారం చేస్తుంది. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులను చూస్తుంటే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అధికారులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలి అని, తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నిన్న ఉదయం 9 గంటల నుండి నేడు ఉదయం 9 గంటల వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 7,665 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే గత కొద్ది రోజులతో పోల్చితే ఈ సంఖ్య కాస్త తక్కువే అని చెప్పాలి.

తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 2,35,525 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6,924 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ భారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,45,636 కి చేరింది.అయితే ప్రస్తుతం ఏపీ లో 87,773 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.

ఏపీ లో గడిచిన 24 గంటల్లో 80 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ న పడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,116 కి చేరింది. అయితే రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.