బిగ్ న్యూస్ : భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత…మరో 730 మంది మృతి

Wednesday, October 14th, 2020, 01:10:43 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే కనిపించినా, మరోమారు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 63,509 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 72,39,390 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 730 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,10,586 కి చేరింది. భారత్ లో కరోనా మృతుల రేటు 1.53 శాతంగా ఉంది.

కరోనా వైరస్ రికవర్యో భారత్ ముందంజ లో ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 74,632 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 63,01,927 కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 86.78 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో 8,26,876 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. కరోనా వైరస్ యాక్టిివ్ కేసుల శాతం భారత్ లో 11.69 గా ఉంది.