ఏపీ లో మరో 73 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, February 8th, 2021, 12:00:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 33,980 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 73 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,85,528 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 7,159 మంది ప్రాణాలను కోల్పోయారు.

అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా, మృతుల సంఖ్య కూడా తగ్గడం జరిగింది. నిన్న ఒక్క రోజే 82 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 8,77,366 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,003 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కి వాక్సినేశన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.