తెలంగాణలో మరో 721 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, December 9th, 2020, 09:20:42 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 51,402 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 721 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,75,261 కి చేరింది. అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,480 కి చేరింది. నిన్న ఒక్కరోజే 753 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,66,120 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 7,661 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.