ఏపీ లో భారీగా నమోదు అయిన కరోనా కేసులు…మరణాలు!

Thursday, August 6th, 2020, 08:24:06 PM IST

Corona_india
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజుల నుండి కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. మళ్లీ 10 వెలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో రాష్ట్ర కరోనా లెక్కల్లో దూసుకుపోతుంది. గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,96,789 కి చేరింది. అయితే దాదాపు రెండు లక్షల కేసులకు చేరువలో ఉంది.

పాజిటివ్ కేసులతో పాటుగా, రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,753 కి చేరింది. అయితే కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 1,12,870 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 82,166 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.