కరోనా అప్డేట్: ఏపీ లో మరో 8,702 కేసులు…72 మరణాలు!

Thursday, September 17th, 2020, 07:11:08 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,492 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 8,702 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,98,567 కి చేరింది. అయితే అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మృతి చెందిన వారి సంఖ్య 5,177 కి చేరింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10,712 మంది కరోనా వైరస్ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 5,05,193 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 88,197 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.